యాప్నగరం

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టులు

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్ డొమెస్టిక్ విభాగంలో నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 4 Nov 2016, 5:59 pm
మినిస్ట్రీ ఆఫ్ ఢిఫెన్స్‌కు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ డొమెస్టిక్ విభాగంలో నావిక్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఏప్రిల్- 2017 కోర్సుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా డొమెస్టిక్ విభాగంలో కుక్, స్టీవార్డ్ పోస్టులను భర్తీ చేస్తారు. ఏడాది పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత పూర్తిస్థాయి నావిక్ పోస్టులో నియమిస్తారు. దీనికి పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
Samayam Telugu indian coast guard navik domestic branch course commence on april 17 notfication
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టులు

విద్యార్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా క్రీడలో ప్రతిభను నిరూపించుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయసు : 2017 ఏప్రిల్ 1 నాటికి 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. చాతీ 80 నుంచి 85 సెం.మీ ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెట్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: దరఖాస్తులను ఆర్డినరీ పోస్టు ద్వారా సంబంధిత జోనల్ అధికారి కార్యాలయానికి పంపాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు తమ దరఖాస్తులను చైన్నైలోని ఈస్ట్రన్ జోన్ కార్యాలయానికి పంపాలి. దరఖాస్తులను The Recruitment Officer, C/o Coast Guard Region (East), Coovam River Mouth,Near Napier Bridge,Chennai Tamil Nadu- 600 009 పేరుతో పంపాలి.
చివరితేది:నవంబరు 20.

నోటిఫికేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.