యాప్నగరం

ఐటీబీపీఎఫ్‌లో ఇంటర్‌తో ఉద్యోగాలు

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 9 Oct 2017, 7:02 pm
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా కంబాటెంట్ మినిస్టీరియల్ విభాగంలోని హెడ్-కానిస్టేబుల్ పోస్టులను భర్తీచేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.45,000 వేలు ప్రారంభ వేతనం ఉంటుంది. దీంతోపాటు ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తారు. అంతేకాదు ఐటీబీపీఎఫ్ కార్యాలయాల్లో మాత్రమే విధులు నిర్వహిస్తారు.
Samayam Telugu indo tibetan border police force head constable jobs notification
ఐటీబీపీఎఫ్‌లో ఇంటర్‌తో ఉద్యోగాలు


హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్): 62
విద్యార్హతలు: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాల వేగం లేదా హిందీలో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ తప్పనిసరి. పురుషుల కనీస ఎత్తు 165 సెం.మీ., చాతీ 77 నుంచి 82 సెం.మీ. ఉండాలి. మహిళల కనీస ఎత్తు 155 సెం.మీ. ఉండాలి.

వయసు: 2017 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఐటీబీపీఎఫ్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. రూ.100 చలనా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారిని రెండో దశకు పంపుతారు. ఇందులో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఉంటాయి. రాత పరీక్షను 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలోనే నిర్వహిస్తారు. దీనిలో జనరల్ అర్థమెటిక్ 30, జనరల్ నాలెడ్జ్ 5, జనరల్ ఇంగ్లిష్ 35, కంప్యూటర్ నాలెడ్జ్ 10 మార్కులు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ తర్వాత మెరిట్ జాబితా ప్రకటిస్తారు. ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబరు 14
ఆన్‌‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: నవంబరు 13

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.