యాప్నగరం

విద్యా ప్ర‌ణాళిక‌కు సూచ‌న‌లు కోరుతున్న కేంద్ర‌ మాన‌వ వ‌న‌రుల శాఖ‌

ఆ శాఖ వెబ్‌సైట్లో సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ఆహ్వానిస్తూ ఒక లింక్‌ను ఉంచ‌డం జ‌రిగింది. స‌ల‌హాలు ఇచ్చేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండిhttp://mhrd.gov.in/suggestions/

TNN 7 Mar 2018, 12:35 pm
1నుంచి 12వ తరగతి వరకూ విద్యకు సంబంధించి సూచనలు ఇవ్వండి
Samayam Telugu mhrd thumb

పట్టణాల్లో మధ్య తరగతికి ఎక్కువ ఖర్చయ్యే అంశాలు రెండే రెండు. అవి ఒకటి ఆరోగ్యం, రెండు పిల్లల విద్య. పిల్లల విద్య కోసం అయ్యే ఖర్చు ఏటేటా పెరుగుతున్నది. దాన్ని ప్రభుత్వాలు నియంత్రించడం లేదు. ఎన్నో నగరాల్లో పేరెంట్స్ కమిటీలు, తల్లిదండ్రుల సంఘాలు పోరాటం చేసి విద్యా సంస్థల్లో రుసుముల నియంత్రణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా మానవ వనరుల మంత్రిత్వ శాఖ సైతం స్పందించింది.
ఆ శాఖ వెబ్సైట్లో సూచనలు, సలహాలను ఆహ్వానిస్తూ ఒక లింక్ను ఉంచడం జరిగింది. సలహాలు ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండిhttp://mhrd.gov.in/suggestions/
అనుభ సహాయ్ నేతృత్వంలో చేంజ్.ఆర్గ్ ఆన్లైన్ పిటిషన్ ఫైల్ చేసింది. దీనికి సంబంధించి ఏళ్ల తరబడి స్వచ్చంద సంస్థలు ప్రభుత్వాలకు తమ వినతులను సమర్పిస్తున్నాయి. గతేడాది నుంచి తల్లిదండ్రుల సంఘాలకు, మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సంప్రదింపులు జరుగుతున్నాయి.
ఒక గొప్ప సొసైటీ ఏర్పడాలంటే విశ్లేషణాత్మక నైపుణ్యం, సరిపడా శ్రద్ధ, జీవన నైపుణ్యాలు, ప్రయోగాత్మక విద్య, ఆటలు, క్రియేటివ్ నైపుణ్యాలు వంటివి అవసరం. ప్రస్తుతం విద్య కేవలం చదువుకే పరిమితమై మిగతా విషయాలను వదిలివేస్తుండటంతో విద్యను ఆసక్తికరంగా, ఉపయోగకరంగా ఉండేందుకు ఏం మార్పులు చేయాలనే దానిపై మంత్రిత్వ శాఖ కసరత్తు జరుపుతోంది.
ఏప్రిల్ 6వ తేదీ లోపు మీ సూచనలను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు పంపుకోవచ్చు. అంతే కాకుండా మీ సూచనలను గోప్యంగా ఉంచుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.