యాప్నగరం

టెక్నాలజీ అభివృద్ధికి ఇస్రో దరఖాస్తుల ఆహ్వానం

గగన్‌యాన్ అంతరిక్ష ప్రయోగానికి అవసరమైన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. చివరితేదీ ఎప్పుడంటే..

Samayam Telugu 25 Apr 2020, 5:22 pm
బెంగళూరు: 2022లో భారత్‌ చేపట్టనున్న గగన్‌యాన్ అంతరిక్ష ప్రయోగానికి అవసరమైన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రేడియోధార్మికత ప్రభావాలను గుర్తించడం, నివారించడంతోపాటు అంతరిక్షంలో వ్యోమగాముల ఆహారం తదితర 18 అంశాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతలను వినియోగించుకునేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. రెండేళ్ల తరువాత జరిగే గగన్‌యాన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములు ఇప్పటికే రష్యాలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Samayam Telugu isro logo


ఈ ప్రాజెక్టుకు సంబంధించి జాతీయస్థాయి పరిశోధన, విద్యా సంస్థలు కొత్త టెక్నాలజీల తయారీకి దరఖాస్తు చేసుకోవచ్చునని బెంగళూరులోని ఇస్రో కేంద్రం తాజాగా ప్రకటన విడుదల చేసింది. జూలై 15వ తేదీలోగా తమ దరఖాస్తులు పంపాలని కోరింది. అంతరిక్షంలో మనిషి మనగలిగేందుకు కీలకమైన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యమని ఆ ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తుల పరిశీలన కోసం ఇస్రో ఒక కమిటీ ఏర్పాటు చేస్తుందని, శాస్త్రీయ ప్రయోజనాలు, అవసరం, సాంకేతికత, సాధ్యాసాధ్యాల వంటి అంశాల ప్రాతిపదికన టెక్నాలజీల ఎంపిక ఉంటుందని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.