యాప్నగరం

Amma Vodi: జగనన్న అమ్మ ఒడి డబ్బులు రాలేదా..? అయితే తల్లిదండ్రులు ఇలా చేయండి

ఈనెల 11న రాష్ట్ర వ్యాప్తంగా 44లక్షల 48వేల మంది తల్లుల ఖాతాలో రూ.6,673 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.

Samayam Telugu 22 Jan 2021, 1:58 pm
ఏపీలో ఈనెల 11న రెండో ఏడాది జగనన్న అమ్మఒడి పథకాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.14వేలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 44లక్షల 48వేల మంది తల్లుల ఖాతాలో రూ.6,673 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
Samayam Telugu జగనన్న అమ్మ ఒడి


అయితే.. ఇటీవల ప్రారంభించిన అమ్మఒడి పథకం ద్వారా కొందమందికి ఇంకా నగదు జమ కాలేదు. దీంతో అర్హత ఉండి నగదు జమకానివారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తోంది. అలాంటి వారి కోసం స్పందన హెల్ప్ లైన్ ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమైంది.

అమ్మఒడి అర్హుల జాబితాలో ఉండి నగదు ఇంకా నగదు జమకాని వారు 1902 హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేయొచ్చు. హెల్ప్ లైన్ కు ఫోన్ చేయలేని వారు విద్యార్థి చదువుకుంటున్న స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, సంబంధిత గ్రామ వాలంటీర్ లేదా గ్రామ సచివాలయంలో సంప్రదించి వివరాలు సరిచూసుకోవచ్చు. హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసే ముందు కింది వివరాలను దగ్గర ఉంచుకోవాలి.

అవసరమైన వివరాలు
  • విద్యార్థి స్కూల్ ఐడీ నంబరు
  • విద్యార్థి ఆధార్ నంబర్
  • పాఠశాల జిల్లా కోడ్ నెంబర్
  • తల్లి లేదా సంరక్షకుని ఆధార్ నంబర్
  • తల్లి లేదా సంరక్షకుని బ్యాంకు అకౌంట్ నంబర్
  • సంబంధిత బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్
  • ఫోన్ నంబర్

గమనిక:
ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనలకు లోబడి ఉన్న వాళ్లు మాత్రమే అమ్మ ఒడి పథకానికి అర్హులు. ఉదాహరణకు.. విద్యార్థి తల్లిదండ్రుల్లో ఎవరికైనా నెలకు రూ.12వేల కంటే అధికంగా ఆదాయం పొందుతున్నా, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినా, ఫోర్ వీలర్ ఉన్నవాళ్లు, తదితరాలు.. అమ్మఒడికి అనర్హులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.