యాప్నగరం

AMMA VODI: అమ్మఒడి పథకానికి నమోదు గడువు పొడిగింపు.. కొత్తవారికీ అవకాశం‌.. దరఖాస్తుకు త్వరపడండి..!

YS JAGAN: అమ్మఒడి పథకానికి నమోదు చేసుకునేందుకు గడువును ప్రభుత్వం పొడిగించింది.

Samayam Telugu 17 Dec 2020, 10:49 am
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకానికి నమోదు చేసుకునేందుకు గడువును పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత విద్యార్థుల చైల్డ్ ఇన్‌ఫో నమోదును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించామని అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని హెచ్ఎంలు, విద్యాశాఖ అధికారులు గుర్తించాలన్నారు. కొత్త విద్యార్థుల నమోదు, ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను నవీకరణ చేయాలన్నారు. అర్హత ఉన్న తల్లుల జాబితాను ఈనెల 20వ తేదీన సంబంధిత పాఠశాలల్లో ప్రదర్శించడం జరుగుతుందని అధికారులు సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Samayam Telugu జగనన్న అమ్మ ఒడి


Must read: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. ఏకంగా 60 శాతం రాయితీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు ఈ అమ్మ ఒడి పధకం వర్తిస్తుంది. ఈ పథకం కింద విద్యార్థులకు ఏడాదికి విడతల వారిగా రూ.15,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ స్ధాయి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది.

జనవరి 9న డబ్బు జమ:
2021 జనవరి 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తల్లుల అకౌంట్లలో రెండో విడత ‘జగనన్న అమ్మ ఒడి’ డబ్బు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల తెలిపారు.

Also read: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆ ఫీజులన్నీ రద్దు చేసిన ప్రభుత్వం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.