యాప్నగరం

వెబ్‌సైట్‌లో 'జేఈఈ అడ్వాన్స్‌డ్‌' ప్రశ్నపత్రాలు

'జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2018'కు సంబంధించిన హిందీ, ఇంగ్లిష్ వెర్షన్ ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంచారు.

Samayam Telugu 22 May 2018, 6:37 pm
'జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2018'కు సంబంధించిన హిందీ, ఇంగ్లిష్ వెర్షన్ ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంచారు. ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి మొత్తం 54 ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కో విభాగం నుంచి 18 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నపత్రాల 'కీ'ని కూడా త్వరలోనే విడుదలచేయనున్నారు. ఈ ప్రశ్నపత్రాన్ని, త్వరలో ఇచ్చే కీతో చూసుకుని.. విద్యార్థులు ఓ అంచనాకు రావచ్చని అధికారులు తెలిపారు.
Samayam Telugu JEE-ADV


ప్రశ్నపత్రం ఆధారంగా 'కీ'లో ఏమైనా అభ్యంతరాలుంటే తెలపవచ్చని వారంటున్నారు. కాగా ఈఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రశ్నలు కఠినతరంగా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఐఐటీల్లో ప్రవేశాల కోసం మే 20న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2018 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష రాసేందుకు మొత్తం 2,31,024 మందికి అర్హత కల్పించగా.. 1,64,822 మంది మాత్రమే పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్‌ పరీక్ష నిర్వహణ బాధ్యాతలు చేపట్టింది.
వెబ్‌సైట్‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.