యాప్నగరం

JEE Admit Cards: 17 నుంచి జేఈఈ మెయిన్‌ హాల్‌టిక్కెట్లు

ఈసారి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. జేఈఈ పరీక్ష కోసం ఏపీలో 18, తెలంగాణలో 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Samayam Telugu 14 Dec 2018, 11:00 pm
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్ష హాల్ టిక్కెట్లు ఈ నెల 17 నుంచి జారీ కానున్నాయి. ఈ విషయాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్న జేఈఈ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 20 వరకు రోజుకు రెండు షిఫ్టులవారీగా నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు.
Samayam Telugu Jee


ఫస్ట్ షిఫ్ట్ కింద ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. రెండో షిఫ్టులో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జేఈఈ పరీక్ష కోసం ఏపీలో 18, తెలంగాణలో 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఏవైనా సందేహాలు ఉంటే 7042399520, 7042399521, 7042399526 ఫోన్‌ నంబర్లకు కాల్ చేయవచ్చునని ఎన్‌టీఏ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.