యాప్నగరం

JEE Main Session 2 Result Date: ఆగస్టు 6వ తేదీన జేఈఈ మెయిన సెషన్‌ 2 ఫలితాలు.. స్పష్టత ఇచ్చిన NTA

JEE Main Session 2 Result 2022: ఆగస్టు 6న ఈ ఫలితాలను ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ పరీక్షల ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ ఆగస్టు 3న వెలువడే అవకాశాలున్నాయి. ఈ ఆన్సర్‌ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 3 Aug 2022, 4:28 pm
JEE Main Session 2 Result Date: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షా ఫలితాలు ఆగస్టు 6న విడుదల కానున్నాయి. ఆగస్టు 6న ఈ ఫలితాలను ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ పరీక్షల ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ ఆగస్టు 3న వెలువడే అవకాశాలున్నాయి. ఈ ఆన్సర్‌ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
Samayam Telugu JEE Main Session 2 Result Date


ఇందుకోసం అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు నాన్‌ రిఫండబుల్‌. జేఈఈ మెయిన్‌ 2022 ఫలితాలు, ఆన్సర్‌ కీని https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు జులై 25 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. మొత్తం 6.29లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు.

JEE Advanced 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి వివరాలివే
ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐఐటీ‌ల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) ఎంతో కీలకం. తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

ప్రారంభ దశలో విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు. ఇక భారతీయ విద్యార్థుల కోసం జేఈఈ మెయిన్ (JEE Main Results) ఫలితాల తర్వాత అప్లికేషన్ కమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక.. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష ఆగస్టు 28న జరగనుంది. ఎగ్జామ్‌ను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. రెండూ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. పేపర్-1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు.. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.