యాప్నగరం

JNTUH 2020-21 అకడమిక్‌ క్యాలెండర్ ఇదే.. ఆన్‌లైన్‌ తరగతులు, చివరి సెమిస్టర్ పరీక్షల‌పై స్పష్టత..!

జేఎన్‌టీయూహెచ్‌ ఇంజనీరింగ్‌ విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంబీఏ విభాగాలకు త్వరలో విద్యా సంవత్సరాన్ని ఖరారు చేస్తామని పేర్కొంది.

Samayam Telugu 21 Aug 2020, 8:46 pm
జేఎన్‌టీయూహెచ్‌ ఇంజనీరింగ్‌ విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా నిర్ణయం తీసుకుంది. మరోవైపు సిలబస్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇక ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంబీఏ విభాగాలకు సంబంధించి త్వరలో విద్యా సంవత్సరాన్ని ఖరారు చేస్తామని పేర్కొంది.
Samayam Telugu జేఎన్‌టీయూ-హైదరాబాద్


ఈ నేపథ్యంలో బీటెక్‌, బీఫార్మసీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక సెప్టెంబర్‌ 16 నుంచి చివరి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అలాగే అక్టోబర్‌ 18 నుంచి 24 వరకు దసరా సెలవులుగా ప్రకటించనున్నారు.

మరికొన్ని ముఖ్య తేదీలు:
  • 2021 జనవరి 11 నుంచి 23 వరకు సెమిస్టర్‌ పరీక్షలు ఉండనున్నాయి.
  • 2021 జనవరి 25 నుంచి సెకండ్‌ సెమిస్టర్‌ ప్రారంభం కానుంది.
  • 2021 మే 7 నుంచి జూన్‌ 19 వరకు సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.
  • 2021 జూన్‌ 21 నుంచి జులై 10 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

అకడమిక్‌ క్యాలెండర్‌:

jntuh academic calender

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.