యాప్నగరం

KVS PGT, TGT, Principal Admit Card: వెబ్‌సైట్‌లో కేవీ పోస్టుల పరీక్ష హాల్‌టికెట్లు.. పరీక్షల షెడ్యూలు..

మొత్తం 8339 పోస్టులకు మొదటి విడతలో ప్రిన్సిపల్ పోస్టులకు, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు నవంబరు 3న.. రెండో విడతలో మిగతా పోస్టులకు డిసెంబరు 22, 23 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు.

Samayam Telugu 16 Oct 2018, 1:19 pm
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 8,339 ఖాళీల భర్తీకి నిర్వహించ తలపెట్టిన రాతపరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విడతల వారీగా సంబంధిత పోస్టులకు రాతపరీక్షలను నిర్వహించనున్నారు. మొదటి విడతలో 76 ప్రిన్సిపల్ పోస్టులకు, 220 వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు నవంబరు 3న రాతపరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
Samayam Telugu KVS

పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి...
నవంబరు 3న ఉదయం 10 గం. నుంచి 12.30 గం వరకు వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు, మధ్యాహ్నం 2 గం. నుంచి సాయంత్రం 4.30 గం. వరకు ప్రిన్సిపల్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. మిగతా పోస్టులకు డిసెంబరు 22, 23 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైవారికి స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేయనున్నారు.

పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా...

* ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులు
పోస్టులుపరీక్ష తేదిపరీక్ష సమయం
వైస్ ప్రిన్సిపల్ 03.11.2018ఉ.10.00 గం. - మ. 12.30 గం.
ప్రిన్సిపల్ 03.11.2018మ.2.00 గం. - సా. 4.30 గం.
undefined

* ప్రైమరీ టీచర్, టీజీటీ (P&HE, AE and WE), పీఆర్టీ పోస్టులు
పోస్టులుపరీక్ష తేదిపరీక్ష సమయం
ప్రైమరీ టీచర్22.12.2018ఉ.9.00 గం. - మ.11.30 గం.
టీజీటీ22.12.2018ఉ.12.30 గం. - మ.3.00 గం.
పీఆర్టీ (మ్యూజిక్)22.12.2018సా.4.00 గం. - సా.6.30 గం.

* పీజీటీ, టీజీటీ, ల్రైబ్రేరియన్ పోస్టులు
పోస్టులుపరీక్ష తేదిపరీక్ష సమయం
పీజీటీ 23.12.2018ఉ.9.00 గం. - మ.11.30 గం.
టీజీటీ 23.12.2018ఉ.12.30 గం. - మ.3.00 గం.
లైబ్రేరియన్ 23.12.2018సా.4.00 గం. - సా.6.30 గం.
వెబ్‌సైట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.