యాప్నగరం

Voter ID : ఓటు లేకుంటే.. కాలేజీల్లో నో అడ్మిషన్.. ఓటు నమోదు తప్పనిసరి చేసిన ప్రభుత్వం

Voter Registration: కాలేజీల్లో అడ్మిషన్ల కోసం 18 సంవత్సరాలు పై బడిన వారందరికీ ఓటరు నమోదును తప్పనిసరి చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 27 Nov 2022, 5:05 am
Maharashtra government To Make Voter Registration Mandatory For College Admission: ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ చాలా మంది యువతీ యువకులు ఓటు హక్కు పట్ట నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రజాస్వామ్య స్పూర్తి, ఓటు వ్యవస్థ లక్ష్యం రోజు రోజుకీ నీరుగారిపోతోంది. ఈ పరిస్థితిని గమనించిన మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో అడ్మిషన్ల కోసం 18 సంవత్సరాలు పై బడిన వారందరికీ ఓటరు నమోదును తప్పనిసరి చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Samayam Telugu Voter Registration


అంతే కాకుండా.. వచ్చే ఏడాది జూన్ నుంచి జాతీయ విద్యావిధానం (NEP) ద్వారా రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థలోని 50 లక్షల మంది విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో కేవలం 32 లక్షల మంది మాత్రమే ముందుకొచ్చారు. దీంతో అధికారులు ఓటరు నమోదు ప్రక్రియకు, అడ్మిషన్లకు లింక్ పెట్టారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం ఓటరు నమోదును తప్పనిసరి చేశారు.

45,284 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. 10వ తరగతి పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు
SSC GD Constable Recruitment 2022 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ జాబ్‌ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల విడుదల చేసిన ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ (SSC GD Constable) పోస్టులను భారీ సంఖ్యలో పెంచింది. CAPF, SSF, ITBP, CRPF, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. SSC GD Constable రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ అక్టోబర్ 27న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 30 చివరితేది.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 24,369 ఖాళీ పోస్టులను ఎస్‌ఎస్‌సీ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొనగా.. తాజాగా ఈ పోస్టుల సంఖ్యను 45,284 కి పెంచింది. అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇంటర్‌ అర్హతతో 1400 ప్రభుత్వ ఉద్యోగాలు.. అమ్మాయిలు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.