యాప్నగరం

GOAL: డిజిటల్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌.. 18-35 ఏళ్ల గిరిజన యువతకు అవకాశం

కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గోల్‌ పేరిట శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.

Samayam Telugu 3 Jul 2020, 12:45 pm
గిరిజన యువత కోసం కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, ఫేస్‌బుక్ ఇండియా ఆధ్వర్యంలో డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది.
Samayam Telugu GOAL


గోల్ (గోయింగ్ ఆన్‌లైన్ యాజ్ లీడర్స్) పేరిట నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమానికి 18-35 ఏళ్ల మధ్య వయసున్న యువత హాజరు కావొచ్చని పేర్కొంది. వ్యాపారం, విద్య, ఆరోగ్యం, రాజకీయం, కళ, పరిశోధన, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాల్లో 9నెలల పాటు శిక్షణ ఇస్తుందని, అనంతరం సర్టిఫికెట్ కూడా జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.

మంచి ప్రతిభ కనబర్చిన వారికి ప్రఖ్యాత సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కూడా కల్పిస్తుందని వివరించింది. ఆసక్తిగల యువత http://goal.tribal.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలకు http://goal.tribal.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Must read: సెప్టెంబర్‌ 15 నుంచి బీటెక్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ ఫస్టియర్‌ క్లాసులు ప్రారంభం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.