యాప్నగరం

NEET (UG) 2019: నీట్ దరఖాస్తు గడువు పొడిగింపు

వయోపరిమితి పెంపుదలను ఖరారు చేసే విషయంలో సీబీఎస్‌ఈ నిర్ణయానికి లోబడి అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Samayam Telugu 30 Nov 2018, 5:05 pm
వైద్యకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ (యూజీ) పరీక్షకు వయోపరిమితి కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. ఈ మేరకు నీట్-2019 దరఖాస్తుల స్వీకరణ గడువును వారం పాటు పొడిగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. 25 సంవత్సరాలు లేదా అంతకుమించి వయసు గల విద్యార్థులు కూడా నీట్ (యూజీ) పరీక్ష రాసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. వాస్తవానికి నవంబరు 30తో గడువు ముగియాలి.. అయితే సుప్రీం తాజా ఆదేశాలతో.. డిసెంబరు 7 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు అవకాశం లభించింది.
Samayam Telugu neet1


అయితే, వయోపరిమితి పెంపుదలను ఖరారు చేసే విషయంలో సీబీఎస్‌ఈ నిర్ణయానికి లోబడి అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 19న ఉండనుంది.

నీట్ దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 1న ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం నవంబర్ 30తో దరఖాస్తుల గడువు ముగిసిపోవాలి. అడ్మిట్ కార్డుల జారీ వచ్చే ఏడాది ఏప్రిల్ 15న జరుగుతుంది. దేశవ్యాప్తంగా 2019 మే 5న పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 5న ఫలితాలు వెలువడించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.