యాప్నగరం

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజినీర్లు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) సైంటిస్ట్-బి/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

TNN 16 May 2017, 7:15 pm
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) సైంటిస్ట్-బి/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లోని పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu nielit scientist b jobs notification 2017
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజినీర్లు


సైంటిస్ట్-బి: 27
విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్.
విద్యార్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉండాలి.

వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో లాజికల్, ఎనలిటికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్షకు 85 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు రూ.400 చెల్లించాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 15
చివరితేది: జూన్ 14

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.