యాప్నగరం

ఆర్మీ శిక్షణతో జేఈఈలో మెరిసిన కశ్మీరీ యువత

కశ్మీర్‌లో పెట్రేగిపోతున్న తీవ్రవాదం, రాళ్లదాడులను సమర్ధంగా ఎదుర్కోవడమే కాదు, ఆ ప్రాంతంలో యువత విద్యావిషయకంగా విజయం సాధించడానికి ఆర్మీ ప్రయత్నిస్తోంది.

TNN 14 Jun 2017, 12:32 pm
కశ్మీర్‌ విద్యార్థుల కోసం సూపర్-40 పేరుతో ఉచిత ఐఐటీ శిక్షణను ఇండియన్ ఆర్మీ మూడేళ్ల కిందట ప్రారంభించింది. బిహార్ సూపర్ 30కి సమాంతరంగా సూపర్-40 పేరుతో ఇండియన్ ఆర్మీ నిర్వహించే కేంద్రంలో శిక్షణ తీసుకున్న తొమ్మిది మంది విద్యార్థులు ఈ ఏడాది జేఈఈలో ర్యాంకులు సాధించి ఐఐటీలో ప్రవేశానికి అర్హత పొందారు. కశ్మీర్‌ లోయలో విద్యార్థులకు సహాయం అందించడానికి దీనిని ఆర్మీ స్వచ్ఛందంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది 35 మంది జేఈఈ మెయిన్స్‌కు హాజరైతే 28 మంది అర్హత సాధించారు. తొలిసారిగా లోయ నుంచి ఐదుగురు బాలికలు ఈ శిక్షణకు హజరైతే వీరిలో ఇద్దరు అర్హత సాధించారు. ఈ ఇద్దరూ ఢిల్లీలోని జామియా మిల్లియా యూనివర్సిటీ, జామియా హమ్దార్డ్ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ కోర్సులో చేరునున్నారు.
Samayam Telugu nine students qualify jee advanced from indian armys coaching initiative kashmir super 40
ఆర్మీ శిక్షణతో జేఈఈలో మెరిసిన కశ్మీరీ యువత


శ్రీనగర్‌లో ఆర్మీ నిర్వహిస్తోన్న ఈ ఉచిత శిక్షణ కేంద్రంలో సెంటర్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ లెర్నింగ్, పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ భాగస్వామిగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన నిరుపేద కశ్మీరీ యువత విద్యావిషయకంగా విజయం సాధించడంలో సహాయ పడటమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అర్హత సాధించిన విద్యార్థులను ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ మంగళవారం కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. మూడేళ్ల కిందట ప్రారంభమైన సూపర్-40 తొలి బ్యాచ్‌లో ఏ ఒక్క విద్యార్థి కూడా జేఈఈలో అర్హత సాధించలేదు. కానీ రెండో ఏడాది 30 మంది జేఈఈ మెయిన్స్‌కు హాజరైతే 25 మంది అర్హత సాధించారు. అలాగే అడ్వాన్స్‌డ్‌లో ఏడుగురు ఉత్తీర్ణత సాధించారని సూపర్-40 ప్రాజెక్ట్ చీఫ్ మేనేజర్ మీనాక్షి షాహీ తెలిపారు. ఈ ఏడాది వీరి సంఖ్య 9 కి చేరుకుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.