యాప్నగరం

Covid-19: ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు రద్దు

సెకండరీ, సీనియర్‌ సెకండరీ పరీక్షలను ఎన్‌ఐఓఎస్ రద్దు చేసింది.‌

Samayam Telugu 11 Jul 2020, 3:05 pm
ఎన్‌ఐఓఎస్ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌)‌ కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ, సీనియర్‌ సెకండరీ కోర్సుల పరీక్షలన్నింటిని రద్దు చేసినట్లు ఎన్‌ఐఓఎస్‌ డైరెక్టర్‌ (ఎవాల్యుయేషన్‌) బి.వెంకటేషన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu ఎన్‌ఐఓఎస్


పరీక్షలు మార్చిలో ప్రారంభం కావల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాటిని జులై 17కి వాయిదా వేశారు. అయితే కరోనా పరిస్థితులు అదుపులోకి రాని కారణంగా పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు.

గతంలో ఆయా సబ్జెక్ట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకొని వారిని ఉన్నత తరగతులకు ప్రమోట్‌ చేయనున్నారు. నాలుగు సబ్జెక్టులు రాసిన వారికి మెరుగైన మార్కులు వచ్చిన మూడు సబ్జెక్టుల మార్కులను, మూడు సబ్జెక్టులు రాసిన వారికి రెండింటిని, రెండు, ఒకటి సబ్జెక్టుల పరీక్షలు రాసిన అభ్యర్థుల విషయంలో థియరీలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

అసలు పరీక్షలు రాయని వారు, మొదటి సారి కోర్సుల్లో ప్రవేశించిన వారి విషయంలో ట్యూటర్లు ఇచ్చే మార్కులు, ఏవైనా ప్రాక్టికల్స్‌కు హాజరై ఉంటే అందులో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుని ప్రమోట్‌ చేస్తామని తెలిపారు.

Also read: కేజీ నుంచి పీజీ వరకు.. ఇక్కడ అందరూ ఉచితంగా చదువుకోవచ్చు

Also read: దేశవ్యాప్తంగా 30 వేల ఉద్యోగాలు ఉఫ్‌.. సెలవుల్లో మరో 60 వేల మంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.