యాప్నగరం

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్సీ) గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 13 Dec 2016, 5:16 pm
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్సీ) గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu nlc graduate executive trainee notification 2016
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

మేనేజ్‌మెంట్ ట్రెయినీ: 100

విభాగాలు: మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్, కంప్యూటర్ సైన్స్.
విద్యార్హతలు: కంప్యూటర్ సైన్స్/ కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ సివిల్/ డిజైన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్- 2017లో అర్హత సాధించాలి.

వయసు: 2016 డిసెంబరు 1 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్) 2017 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గేట్ స్కోర్‌కు 85 శాతం మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూకు 15 శాతం మార్కులు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. గేట్- 2017 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జనవరి 6
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: జనవరి 31

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.