యాప్నగరం

ఆ తరగతుల వారికి.. హోంవర్క్ ఉండదు: జవదేకర్

పాఠశాలల్లో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వరాదని ఆదేశిస్తూ వచ్చే వర్షకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తేనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

Samayam Telugu 4 Jun 2018, 2:50 am
పాఠశాలల్లో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వరాదని ఆదేశిస్తూ వచ్చే వర్షకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తేనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. విద్య వినోదంతో కూడినదై ఉండాలని.. చిన్నారులపై ఒత్తిడి పెంచకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకటి, రెండో తరగతి విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు తగ్గించడంతోపాటు వారికి హోంవర్క్ ఇవ్వరాదని రాష్ట్రాలను ఆదేశించాలని మే 30న జారీచేసిన మధ్యంతర ఆదేశాల్లో మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
Samayam Telugu hrd


ఈ తీర్పును స్వాగతించిన జవదేకర్‌.. కోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని.. తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే 'నో హోంవర్క్‌ బిల్లు' తేనున్నట్లు తెలిపారు. బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు సరదాగా నేర్చుకోలేనిదేమీ లేదని తాను విశ్వసిస్తున్నట్లు మీడియాకు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.