యాప్నగరం

ఎన్పీసీఐఎల్‌లో బీటెక్ వాళ్లకు ఉద్యోగాలు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లోని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 9 Jun 2017, 7:37 pm
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లోని ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారిని దేశవ్యాప్తంగా ఉన్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ కేంద్రాల్లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా నియమిస్తారు.
Samayam Telugu nuclear power corporation ltd executive trainees
ఎన్పీసీఐఎల్‌లో బీటెక్ వాళ్లకు ఉద్యోగాలు


ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ: 150
విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్.
విద్యార్హతలు: మెకానికల్/ ప్రొడక్షన్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ సివిల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉండాలి. గేట్- 2017లో అర్హత సాధించాలి.
వయోపరిమితి: 2017 జూన్ 15 నాటికి 26 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: గేట్ 2017 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితాను తయారు చేస్తారు. మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. గేట్ స్కోర్‌కు 80 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 20 శాతం మార్కులు కేటాయిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తారు. వీరికి ఏడాది పాటు శిక్షణ తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్ హోదాలో నియమిస్తారు.
దరఖాస్తు: ఎన్పీసీఐఎల్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు: రూ.500 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: జూన్ 15

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.