యాప్నగరం

90 వేల ఖాళీలు.. ఆస్ట్రేలియా జనాభాను మించిన అప్లికేషన్లు

రైల్వే శాఖలో 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఏకంగా ఆస్ట్రేలియా జనాభాను మించిన స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి.

TNN 31 Mar 2018, 10:20 am
రైల్వే శాఖ ఇటీవల 90 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీలు భారీ సంఖ్యలో ఉండటంతో ఏకంగా 2.8 కోట్ల మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఊహించని స్థాయిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు అవాక్కయ్యారు. ఈ అప్లికేషన్ల సంఖ్య ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇది శాంపిల్ మాత్రమే.. తుది గడువును మరి కొద్ది రోజులు పొడిగిస్తే దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టే దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Samayam Telugu railway jobs


ఏప్రిల్‌లో రైల్వే శాఖ మరో 20 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదే జరిగితే మొత్తం ఖాళీలు 1.1 లక్షలకు చేరతాయి. మరి దరఖాస్తుల సంఖ్య ఇంకెంత మేర పెరుగుతుందో ఊహించగలరా?

అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ రైల్వేలో 13 లక్షల మంది పని చేస్తున్నారు. ఇటీవల రైల్వే శాఖ విడుదల చేసిన ఉద్యోగ నియామక ప్రకటనలోలోకోపైలెట్లు, టెక్నీషియన్లు, కార్పెంటర్లు, క్రేన్ డ్రైవర్ల పోస్టులు 26,502 ఉన్నాయి. వీటితోపాటు గ్యాంగ్ మెన్, స్విచ్ మెన్, ట్రాక్ మెన్, వెల్డర్లు, హెల్పర్లు, పోర్టర్ల ఖాళీలు 62,907 ఉన్నాయి. వీటికి పదోతరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. దీంతో భారీ సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.