యాప్నగరం

PM MODI: విద్యార్థులు నచ్చిన కోర్సు చదువుకోవచ్చు.. భారీ పుస్తకాలు అవసరం లేదు: ప్రధాని మోదీ

కొత్త విద్యా విధానం భావి తరాలకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రధాని మోదీ వివరించారు.

Samayam Telugu 7 Aug 2020, 11:57 am
నూతన జాతీయ విద్యా విధానం-2020 సవాలుతో కూడుకున్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొత్త విద్యా విధానం భావి తరాలకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రధాని మోదీ వివరించారు. ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జాతీయ విద్యా విధానం పై ప్రసంగిస్తూ రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు.
Samayam Telugu ప్రధాని నరేంద్ర మోదీ


దేశ భవిష్యత్తు కోసమే ఈ విధానం:
జాతీయ విద్యా విధానంలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. కొత్త విద్యా విధానంతో విస్తృత ప్రయోజనాలు కలుగుతాయన్నారు. 30 ఏళ్ల తర్వాత కొత్తగా జాతీయ విద్యా విధానం తీసుకువస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెచ్చామని, దేశ భవిష్యత్‌ కోసమే నూతన విద్యా విధానమని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానంపై ఆందోళన వద్దని.. రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.

భారీ పుస్తకాలు అవసరం లేదు:21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యాలు ఎంతో అవసరం. యువతలో విద్యా నైపుణ్యాలు పెంపొందించాలి. కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలని అన్నారు. సిలబస్‌ పేరుతో భారీ పుస్తకాలు అవసరం లేదని పేర్కొన్నారు. పిల్లల్లో మనోవికాసం పెంచే సిలబస్‌ మాత్రమే ఉండాలని సూచించారు. జాతి నిర్మాణంలో నూతన విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.