యాప్నగరం

AP: ఈనెల 23 నుంచి పాలిటెక్నిక్, ఐటీఐ‌ కాలేజీలు ప్రారంభం..!

రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు నవంబ‌రు 23 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

Samayam Telugu 17 Nov 2020, 10:21 am
కరోనా కారణంగా చదువులు అస్తవ్యస్తంగా మారాయి. దాదాపు ఏడు నెలలుగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి కొంతమేర అదుపులోకి రావడంతో ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలను పునఃప్రారంభించడానికి ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు నవంబ‌రు 23 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.
Samayam Telugu పాలిటెక్నిక్‌ కాలేజీలు


ఈ మేరకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము న‌వంబ‌రు 16న‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి 15 వరకు ఉండేలా నిర్ణయించారు. అలాగే.. పనిదినాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెమిస్టరుకు 90 చొప్పున మొత్తం 180 రోజులు తరగతులు నిర్వహిస్తారు. రెండో శనివారం కూడా అదనపు తరగతులు నిర్వహిస్తారు.

ఐటీఐ తరగతులు సైతం:
ఐటీఐ కోర్సులకు సంబంధించిన క్లాసులు సైతం న‌వంబ‌రు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో ఏడాది విద్యార్థులకు ముందుగా తరగతులు ప్రారంభిస్తారు. మొదటి ఏడాది విద్యార్థుల‌కు డిసెంబరు 14 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

Must read: డిప్లొమా వాళ్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎన్‌సీఆర్‌టీసీలో జూనియర్ ఇంజినీర్ జాబ్స్

Also read: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫస్టియర్ క్లాసుల ప్రారంభం వాయిదా..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.