యాప్నగరం

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం

Primary Schools Reopen: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు.

Samayam Telugu 29 Jan 2021, 9:20 pm
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తరగతుల నిర్వహణ చేపడతామని పేర్కొన్నారు.
Samayam Telugu స్కూళ్లు పునఃప్రారంభం


ఆర్‌బీఐలో 322 ఆఫీస‌ర్ జాబ్స్‌.. నెలకు రూ.83 వేల వరకూ జీతం.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గదులు సరిపడని చోట రోజు మార్చి రోజు తరగతులు నిర్వహించడం జరగుతుందని మంత్రి సురేష్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తల్లిదండ్రుల లిఖిత పూర్వక హామీతోనే పాఠశాలలకు విద్యార్థులను అనుమతించడం జరుగుతుందని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థులు, టీచర్లు అందరూ కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని.. మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.

ఇక.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను జూన్ 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏపీ సర్కార్‌ ప్రాథమికంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.