యాప్నగరం

TS Panchayat Secretary Qualification: పంచాయతీ కార్యదర్శి పోస్టుల అర్హతలు, వివరాలు

పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15 వేల చొప్పున వేతనం ఇస్తూ.. మూడేళ్ల తర్వాత పనితీరు ఆధారంగా ప్రభుత్వం వీరిని క్రమబద్ధీకరిస్తుంది.

Samayam Telugu 3 Sep 2018, 12:45 pm
తెలంగాణలో 9,335 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15 వేల చొప్పున వేతనం ఇస్తూ.. మూడేళ్ల తర్వాత పనితీరు ఆధారంగా ప్రభుత్వం వీరిని క్రమబద్ధీకరిస్తుంది.
Samayam Telugu panchayat


అర్హతలు, ఇతర వివరాలు..

* జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి: 9,355 పోస్టులు

అర్హ‌త‌:
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. అభ్యర్థులు కచ్చితంగా కొత్త జిల్లాల్లో స్థానికులై ఉండాలి.

వ‌య‌సు:
31.08.2018 నాటికి 18-39 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు:
రూ.800. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.400.

ఎంపిక‌ విధానం:
రాత‌ప‌రీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

రాత ప‌రీక్ష ఎలా ఉంటుంది..?
మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు పేపర్-1, 100 మార్కులకు పేపర్-2 ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. ఒక్కో పేపరుకు 2 గంటల సమయం కేటాయించారు.
* పేపర్-1లో జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
* పేపరు-2లో తెలంగాణ పంచాయతీరాజ్‌ నూతన చట్టానికి, పంచాయతీరాజ్‌ సంస్థలకు, స్థానిక ప్రభుత్వాలు, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, ఆర్థికం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.09.2018.
* ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: 11.09.2018.
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 12.09.2018.

నోటిఫికేషన్

ఆన్‌లైన్ అప్లికేషన్

Related Article: 9355 పోస్టులతో పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్‌ విడుదల

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.