యాప్నగరం

RRB 2019: ఎన్టీపీసీ 'అప్లికేషన్ స్టేటస్' ఎప్పుడంటే?

RRB NTPC Recruitment 2019 | రెండు విడతల రాతపరీక్షల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో ఎన్టీపీసీ పోస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేయనుంది.

Samayam Telugu 16 Aug 2019, 12:51 pm
రైల్వేల్లో ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటిగిరీస్) పోస్టులకు సంబంధించి అప్లికేషన్ స్టేటస్, అడ్మిట్ కార్డు, పరీక్ష తేదీ వివరాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే వీటికి సంబంధించి మీడియాలో తప్పుడు వార్తలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. అప్లికేషన్ స్టేటస్, ఇతర వివరాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆర్ఆర్‌బీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదని అంటున్నారు. ఆర్‌ఆర్‌బీ విడుదల చేసిన ప్రకటన గ్రూప్-డి పోస్టుల పరిధిలోని RRC CEN 01/2019 నోటిఫికేషన్‌కు సంబంధించినదని.. RRB CEN 01/2019 NTPC పోస్టులకు సంబంధించినది కాదని అధికారులు స్పష్టం చేశారు.
Samayam Telugu rrb


ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఆగస్టు/ సెప్టెంబరు నెలల్లో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇతర పోస్టులకు సంబంధించిన రాతపరీక్షలు జరుగుతున్నందున.. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాతే ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవలే జూనియర్ ఇంజినీర్ 'స్టేజ్-1' ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. జేఈ 'స్టేజ్-2' పరీక్షను ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు పూర్తయినే తర్వాతే ఎన్టీపీసీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు ఆర్‌ఆర్‌బీ పారామెడికల్ ఫలితాలను వెల్లిడించాల్సి ఉంది.

ఎన్టీపీసీ పోస్టుల రాతపరీక్ష విధానం..
✦ మొత్తం 100 మార్కులకు మొదటి విడత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు.పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కోత విధిస్తారు.
✦ మొదటి విడత పరీక్షలో అర్హత సాధించిన వారికి రెండో విడత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 మార్కులకు రెండో విడత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు 120 నిమిషాలు కేటాయించారు.పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతున మార్కులు కోత విధిస్తారు.
✦ రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల అనంతరం తుది ఫలితాలు వెల్లడిస్తారు.

Related Articles:

ఎన్టీపీసీ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తగ్గిన ఎన్టీపీసీ పోస్టుల సంఖ్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.