యాప్నగరం

విదేశాల్లో పరిశోధనకు... రామలింగస్వామి ఫెలోషిప్స్!

న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ)... విదేశాల్లో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌లలో పరిశోధనలు చేసే పీహెచ్‌డీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

TNN 29 Mar 2018, 11:56 am
న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ)... విదేశాల్లో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌లలో పరిశోధనలు చేసే పీహెచ్‌డీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ ఇది. దీనిద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్లపాటు ఫెలోషిప్ అందుతుంది. ఈ ఐదేళ్లపాటు... ఫెలోషిప్ కింద నెలకు రూ. 1,00,000 చెల్లిస్తారు. దీంతోపాటు హెచ్‌ఆర్‌ఏ కింద అదనంగా మరో రూ. 18,500 చెల్లిస్తారు. మొదటి రెండు సంవత్సరాలు రూ.10 లక్షలు... మూడు, నాలుగు సంవత్సరాల్లో రూ.7.50 లక్షలు, చివరి సంవత్సరంలో రూ.5 లక్షలు రిసెర్చ్ లేదా కంటింజెన్సీ గ్రాంట్ కింద అదనంగా చెల్లిస్తారు.
Samayam Telugu fellow

  • ఎవరు అర్హులు...ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి... అగ్రికల్చర్, హెల్స్ సైన్సెస్, బయో ఇంజినీరింగ్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, బయోఇన్‌ఫర్మాటిక్స్, ఇతర సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/ఎండీ (లేదా) తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. విదేశీ ల్యాబొరేటరీలో 3 సంవత్సరాల.. వ్యవధిగల పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
  • వయోపరిమితి...అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలకు మించకూడదు.
  • దరఖాస్తు విధానం...అర్హులైనవారు పోస్ట్, ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పంపాలి. దరఖాస్తులు నింపి... అవసరమైన అన్ని సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత అధికారికి నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి.
  • ఎంపిక విధానం...రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 15.05.2018.
చిరునామా: Dr. Meenakshi Munshi,
Adviser/Scientist “G” Department of Biotechnology,
Block-2, 7th Floor, CGO Complex,
Lodhi Road, New Delhi -110 003,
ఈమెయిల్: rlsfellowship.dbt@nic.in
వెబ్‌సైట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.