యాప్నగరం

ఏపీలో దాదాపు 35 వేలు.. తెలంగాణలో 18 వేల టీచర్‌ పోస్టులు ఖాళీ..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 52,788 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ ఫోఖ్రియాల్‌ వెల్లడించారు.

Samayam Telugu 21 Sep 2020, 12:53 pm
తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 52,788 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ ఫోఖ్రియాల్‌ వెల్లడించారు. లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానమిచ్చారు. దేశంలోని 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలలకు 61,84,467 ఉపాధ్యాయ పోస్టులు మంజూరుచేయగా, ప్రస్తుతం 10,60,139 (17.14%) ఖాళీగా ఉన్నాయన్నారు.
Samayam Telugu టీచర్‌ జాబ్స్


ఖాళీగా ఉన్న పోస్టుల్లో తెలంగాణలో 1,40,902 పోస్టులకుగాను 17,900 (12.70%) భర్తీ కాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 2,46,552 పోస్టులకుగాను 34,888 (14.15%) భర్తీకి నోచుకోలేదు. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ. పదవీ విరమణ, విద్యార్థుల సంఖ్య పెరిగేకొద్దీ అదనపు నియామకాలు అవసరం అవుతాయి. ఖాళీలూ పెరుగుతూ పోతాయని విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ విశ్లేషించారు. విద్య ఉమ్మడి జాబితాలోకి వస్తుందని, నియామకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే.. 2020-21 విద్యాసంవత్సరాన్ని జీరో ఇయర్‌గా మార్చబోమని ఆయన తెలిపారు.

Must read: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 జాబ్స్‌.. దరఖాస్తులు ప్రారంభం..!

Also read: ఐబీపీఎస్‌ 2557 బ్యాంక్ ఉద్యోగాలు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్ ఇదే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.