యాప్నగరం

ఈ రోజును మర్చిపోలేను.. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో రతన్ టాటా

ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం కోసం రతన్ టాటా తొలిసారి విశాఖపట్నం వచ్చారు.

Samayam Telugu 10 Dec 2018, 11:06 pm
వైజాగ్: ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చీఫ్ గెస్ట్‌‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నేను జీవించి ఉన్నంత వరకూ ఈ రోజును గుర్తుంచుకుంటానంటూ ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఏయూకు టాటా గ్రూప్‌ ఏం చేయగలదనే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఏయూతో కలిసి పరిశోధనలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు.
Samayam Telugu ratan tata au


విశాఖ పరిశుభ్రతకు రతన్ టాటా ముచ్చటపడ్డారు. నగరాన్ని క్లీన్ సిటీగా అభివర్ణించారు. ఇప్పటి వరకూ మేం ఈ నగరంపై దృష్టి సారించలేదు, ఇకపై ఫోకస్ పెడతామన్నారు. వైజాగ్‌లో టాటా గ్రూప్‌ పరిశ్రమ ఏర్పాటు అంశంపై ముంబై వెళ్లాక ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏయూ వీసీ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణాన్ని కూడా రతన్ టాటా సందర్శించారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్య, వైద్యం, సాధికారత తదితర రంగాల్లో గత పాతికేళ్లుగా జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌ అందిస్తోన్న సేవలను ఆయన కొనియాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.