యాప్నగరం

నీతా అంబానీ యోచనలో 'రిలయెన్స్ యూనివర్సిటీ'..?

దేశంలో విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి... అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు 'రిలయెన్స్ ఫౌండేషన్' వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తెలిపారు.

TNN 12 Mar 2018, 1:59 pm
దేశంలో విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి... అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు 'రిలయెన్స్ ఫౌండేషన్' వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తెలిపారు. అత్యంత సమర్థమైన, ప్రతిభావంతమైన యువతరాన్ని తయారుచేసేందుకు... 'యూనివర్సిటీ' నెలకొల్పే.... కాంక్ష ఉన్నట్లు ఆమె తెలిపారు. శాస్త్ర, సాంకేతిక, క్రీడా, కళారంగాలను ప్రోత్సహించడమే యూనివర్సిటీ స్థాపన ప్రధాన లక్ష్యంగా ఉంటుందన్నారు.
Samayam Telugu reliance foundation to set up a university nita ambani
నీతా అంబానీ యోచనలో 'రిలయెన్స్ యూనివర్సిటీ'..?


మార్చి 10న ముంబయిలో జరిగిన 'ఇండియా టు డే' కాంక్లేవ్‌ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'దేశ పురోభివృద్ధి ప్రధానంగా... విద్య, క్రీడా రంగాలపై ఆధారపడి ఉందన్నారు. దీనికనుగుణంగా... దేశంలో క్రీడా, విద్యారంగాలకు వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించడమే లక్ష్యంగా యూనివర్సిటీ' నెలకొల్పే యోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు.

2010లో ప్రారంభమైన 'రిలయెన్స్ ఫౌండేషన్' భారత్‌లో క్రీడా, విద్యారంగ అభివృద్ధికి నిరంతరాయంగా పాటు పడుతుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా... రిలయెన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ...14 పాఠశాలలను నిర్వహిస్తున్నామని.... వీటి ద్వారా 16 వేల మంది చిన్నారులకు విద్యనందిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో కొత్తగా రెండు పాఠశాలలను స్థాపించామని ఆమె అన్నారు. 2013లో సంభవించిన వరదల్లో పూర్తిగా దెబ్బతిన్న పాఠశాలల స్థానంలో వీటి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.