రైల్వేలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన 'గ్రూప్-ఇ' పరీక్షకు సంబంధించిన ఆన్సర్ 'కీ' (ఆన్సర్ షీట్)ని రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆదివారం (జనవరి 13న) విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఆర్పీఎఫ్ అధికారిక వెబ్సైట్ ద్వారా లాగిన్ కావడం ద్వారా తమ జవాబులను చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పుట్టిన తేది, పరీక్ష రాసిన తేది, పరీక్ష రాసిన బ్యాచ్ వివరాలను సమర్పిచడం ద్వారా ఆన్సర్ షీట్‌ను పొందవచ్చు.
ఆన్సర్ షీట్ కోసం క్లిక్ చేయండి.. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్‌లో మొత్తం 8,619 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. వీటిలో 3619 పోస్టులను పురుషులకు కేటాయించగా.. 5000 పోస్టులకు మహిళలకు కేటాయించారు. ఈ పోస్టులకు డిసెంబరు 20 నుంచి 23 వరకు రాతపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన కీనే తాజాగా విడుదల చేశారు.
వెబ్సైట్
ఆన్సర్ షీట్ కోసం క్లిక్ చేయండి..
వెబ్సైట్