యాప్నగరం

RRB ALP Exam: అసిస్టెంట్ లోకోపైలట్ 'స్టేజ్-2' పరీక్ష వాయిదా

దేశవ్యాప్తంగా 36 లక్షల మంది పరీక్ష రాయగా.. 5,88,605 మంది అభ్యర్థులు రెండో దశ పరీక్షలకు ఎంపికయ్యారు.

Samayam Telugu 13 Nov 2018, 4:15 pm
రైల్వే అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 12న జరగాల్సిన రెండో దశ పరీక్షను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వాయిదా వేసింది. అదేరోజు రైల్వేశాఖలోని లెవల్1 పోస్టులు, అకడమిక్ పరీక్షలు ఉండటంతో అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్ష తేదిని వాయిదా వేసినట్లు బోర్డు ప్రకటించింది. డిసెంబరు 24న అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టుల రెండో దశ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షకు 10 రోజుల ముందు నుంచి పరీక్ష హాల్‌టికెట్లు (అడ్మిట్ కార్డు) అందుబాటులో ఉంచనున్నారు.
Samayam Telugu RRB

అధికారిక ప్రకటన కోసం క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా 64,371 అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి స్టేజ్-1 ఆన్‌లైన్ పరీక్షలను ఆగస్టు (9, 17, 20, 21)లో నిర్వహించారు. కేరళలో మాత్రం వరదల కారణంగా వాయిదా పడిన పరీక్షలను సెప్టెంబరు 4న నిర్వహించారు. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 47.56 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 36 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. అయితే వీరినుంచి 5,88,605 మంది అభ్యర్థులు రెండో దశ పరీక్షలకు ఎంపికయ్యారు.

స్టేజ్-2 పరీక్ష ఇలా..
* రెండో దశ (స్టేజ్-2) పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి (పేపర్-ఎ, పేపర్-బి). పేపర్-ఎ పరీక్ష అభ్యర్థులందరికీ కామన్‌గా ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. పేపర్-బి పరీక్ష మాత్రం ట్రేడ్ల వారీగా ఉంటుంది. పరీక్ష సమయం 100 నిమిషాలు.
* 'పేపర్-ఎ'లో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ & ఇంజినీరింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
* 'పేపర్-బి'లో సంబంధిత ట్రేడ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
వెబ్‌సైట్

Related Article:
అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్ ఫలితాలు విడుదల..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.