యాప్నగరం

TS: 1-10వ తరగతి వరకు కొత్త విద్యా విధానం.. వర్క్‌షీట్లు ప్రవేశ పెట్టే యోచన

కరోనా నేపథ్యంలో ఎస్‌సీఈఆర్‌టీ కసరత్తు. సబ్జెక్ట్‌ నిపుణులతో తయారు చేయించే పనిలో బిజీ

Samayam Telugu 10 Jul 2020, 6:36 pm
కరోనా వచ్చింది సమస్తం మార్చింది. మార్పులో విద్యా రంగం ప్రథమ స్థానంలో ఉంది. బడికి పోవడం, క్లాస్‌ రూం టీచింగ్‌ ఇవేమీ లేవు. ఇంటి దగ్గరే చదువులు. ఈ పరిస్థితుల్లో పిల్లలు చదువుకు నష్టం కలగకూడదు అంటే.. టీచర్లు బోధించే శైలి, పిల్లలు పాఠాలను అర్థం చేసుకునే విధానం మారాలి.
Samayam Telugu 1-10వ తరగతి


ఇదే ఆలోచనతో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తరహాలో పాఠశాల విద్యాశాఖ వర్క్‌షీట్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఈ వర్క్‌షీట్లను అందించాలని భావిస్తోంది. సబ్జెక్ట్‌ నిపుణులతో పాఠాల వారీగా తయారు చేయించే పనిలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఉంది.

రెండు స్థాయిల్లో ఈ వర్క్‌షీట్లను రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ విధానం అమలు చేయడంతోపాటు వాటిని విద్యార్థులకు అందించేందుకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు.

Must read: ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు మూత.. ఖచ్చితంగా పాటించాలన్న కేంద్రం

అసలేంటీ వర్క్‌షీట్లు..?
స్కూల్లో టీచర్‌ పాఠం చెప్పిన తర్వాత పిల్లలకు హోంవర్క్‌ ఇవ్వడం తెలిసిందే. ఇవి మామూలుగా ఆ రోజు బోధించిన పాఠంలోని అంశాలపై ప్రశ్నలు, జవాబుల రూపంలో ఉంటాయి.

కానీ వర్క్‌షీట్లు వీటికి కొంచెం భిన్నంగా ఉంటాయి. విద్యార్థి సృజనాత్మకత, తర్కం, విశ్లేషణ తదితర సామర్థ్యాలను పరిశీలించేలా, పాఠాలను అన్నీ కోణాల్లో అర్థం చేసుకునేలా ఉంటాయి.

ఈ విధానం వల్ల ఉపాధ్యాయులు చెప్పిన దానికంటే విద్యార్థులు సొంతంగా ఆలోచించి నేర్చుకునేందుకు వీలుంటుంది. అలాగే ఒక విద్యార్థి ఆ పాఠ్యాంశాన్ని ఎంత వరకు అర్థం చేసుకున్నాడో అంచనా వేసే వీలుంటుంది.

Must read: సబ్జెక్టుల వారీగా సీబీఎస్ఈ 2020-21 కొత్త సిల‌బ‌స్‌ వివరాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.