యాప్నగరం

TS School Re-open Date: బడిపిల్లలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు మరిన్ని రోజులు పొడిగింపు

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎండలు అధికంగా ఉన్న కారణంగా మరికొన్ని రోజులు సెలవులు సొడిగించింది.

Samayam Telugu 31 May 2019, 12:35 pm

ప్రధానాంశాలు:

  • జూన్ 1న తెరచుకోవాల్సిన పాఠశాలలు.. జూన్ 12 నుంచి ప్రారంభం
  • ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu school
వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 11 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు మే 24న అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే వీటితోపాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, కేంబ్రిడ్జి, ఐటీ తదితర బోర్డుల పరిధిలో నడిచే పాఠశాలలు సైతం జూన్‌ 12నే పునఃప్రారంభించాలని విద్యాశాఖ కమిషనర్‌ విజయకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మే 29న ఉత్తర్వులు జారీచేశారు. ఆదేశాలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.