యాప్నగరం

AP: నవంబర్ 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు స్కూళ్లు..? సిలబస్‌ తగ్గింపు యోచన..!

ఏపీలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్లను తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 15 Oct 2020, 8:39 am
ఏపీలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్లను తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా ఇప్పటికే దాదాపు సగం రోజులు గడిచిపోయిన విషయం తెలిసిందే. అయితే పాఠశాల విద్యాశాఖ అందుకు అనుగుణంగానే అకడమిక్‌ క్యాలెండర్‌ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Samayam Telugu స్కూళ్లు రీ ఓపెన్


మూమూలు రోజుల్లో 220 పనిదినాలు రావాల్సి ఉండగా.. ఈ ఏడాది ఇప్పటివరకు స్కూళ్లే ప్రారంభం కాలేదు. దీంతో పనిదినాలు సంఖ్య తగ్గిన కారణంగా సిలబస్‌ను కూడా తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌సీఈఆర్టీ కూడా సిలబస్‌ను తగ్గించే ఆలోచన చేస్తున్నందున ఇదే విధానాన్ని ఇక్కడా పాటించాలని భావిస్తున్నట్లు కనబడుతోంది.

Must read: విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు

పండుగ సెలవులనూ తగ్గించనున్నారు. సంక్రాంతికి మూడు రోజులే సెలవులు ఉండనున్నాయి. నవంబర్‌ 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు స్కూళ్లు పనిచేసేలా ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నారు. అలాగే వారానికి ఆరు రోజులు స్కూళ్లు పనిచేయనున్నాయి. ఇక టీచర్ల సెలవుల విషయంలో కూడా నిబంధనలు విధించనున్నారు.

నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ఐదు రోజులే క్యాజువల్‌ లీవ్స్‌ (సీఎల్‌) వినియోగించుకునేలా ప్రణాళిక ఉండబోతోంది. ఇక పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ నెలలో నిర్వహించేలా ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఈ విషయాలపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Also read: అమ్మాయిలకు రూ.24 వేల స్కాలర్‌షిప్‌.. దరఖాస్తుకు ఈనెల 31 ఆఖరు తేది..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.