యాప్నగరం

జూన్ 1న తెరచుకోనున్న పాఠశాలలు!

వేసవి సెలవులు ముగియనుండటంతో.. తెలంగాణలో జూన్ 1 నుంచి పాఠశాలలు తెరచుకోనున్నాయి. జూన్ 2న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 'రాష్ట్రావతరణ వేడుకలు' నిర్వహించనున్నారు.

Samayam Telugu 31 May 2018, 2:45 am
వేసవి సెలవులు ముగియనుండటంతో.. తెలంగాణలో జూన్ 1 నుంచి పాఠశాలలు తెరచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ బుధవారం (మే 30) తెలిపింది. జూన్ 2న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 'రాష్ట్రావతరణ వేడుకలు' నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మరో వారం రోజుల వరకు ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉండటంతో.. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తి మేరకు జూన్ 4 నుంచి 8 వరకు ఒంటిపూట బడి నిర్వహించనున్నారు. జూన్ 4 నుంచి 8 వరకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 'బడిబాట' కార్యక్రమం నిర్వహించనున్నారు.
Samayam Telugu schools


ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం కొత్త విద్యా సంవత్సరం జూన్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. 2019 ఏప్రిల్‌ 13 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.