యాప్నగరం

మార్కులు తక్కువగా ఉన్నా.. ఈ స్కిల్స్‌తో జాబ్ పక్కా

మార్కులు తక్కువగా ఉన్నా ఫర్వాలేదు.. ఈ స్కిల్స్ మీలో ఉంటే ఉద్యోగం సాధన తేలిక అవుతుంది.

TNN 27 Feb 2017, 6:42 pm
కాలేజీ నుంచి బయటకు అడుగుపెట్టబోయే వారిని ప్రధానంగా కలవరపెట్టే సమస్య ఉద్యోగం. అప్పటి దాకా కాలేజీ లైఫ్‌ గురించి మాత్రమే తెలిసిన వారికి నియామక సంస్థలు ఎలాంటి స్కిల్స్‌ను కోరుకుంటాయనే విషయంలో అంతగా అవగాహన ఉండదు. ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో కేవలం విద్యార్హతలతోనే ఉద్యోగం రావడం కష్టం. ఏళ్ల క్రితమే బీటెక్, ఎంసీఏలు చదివి ఇప్పటికీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారే ఇందుకు నిదర్శనం. కొన్నిసార్లు ఎక్కువ మార్కులు వచ్చిన వారి కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికే జాబ్ తొందరగా రావడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్‌కు రిక్రూటర్లు పెద్ద పీట వేయడం వల్లే తక్కువ మార్కులు ఉన్నవారు కూడా తేలిగ్గా జాబ్ కొట్టే అవకాశాలుంటాయి. ఆ స్కిల్స్ ఏంటంటే..
Samayam Telugu skills recruiters look for in employees
మార్కులు తక్కువగా ఉన్నా.. ఈ స్కిల్స్‌తో జాబ్ పక్కా


ఉద్యోగంలో భాగంగా టీంలో సభ్యుడిగా పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి పది మందితో కలిసి పని చేయాలంటే సహనం, పరస్పర సహకారం, వ్యక్తిగత, టీం పనుల మధ్య పనుల మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం ముఖ్యం.

ఉద్యోగికి వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. వేగంగా నిర్ణయాలు తీసుకునేవారు, సమస్యలను పరిష్కరించే లక్షణం ఉన్న వారి పట్ల కంపెనీలు ఆసక్తి చూపుతాయి. అంతేగానీ.. సమస్యలను కొని తెచ్చే వారి పట్ల రిక్రూటర్లు ఆసక్తి కనబర్చరు.

పని చేయడమే కాదు... దాని ప్రాధాన్యాలను కూడా తెలుసుకొని వ్యవహరించాలి. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేయాల్సి రావచ్చు. అలాంటి సందర్భాల్లో ఏ పని ముందు చేయాలి అనే అవగాహన ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పనులను చక్కబెట్టే నేర్పు కూడా అవసరం. అత్యవసరమైన పనిని పక్కనబెట్టి అంతగా ప్రాధాన్యం లేని పని చేసే వారంటే ఏ సంస్థ కూడా భరించలేదు.

ఇక అన్నింటి కంటే ముఖ్యమైంది చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఓ గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. కాబట్టి విభిన్న రకాల వ్యక్తులతో మాట్లాడాల్సి ఉంటుంది. ఎంత మందితో మాట్లాడుతున్నాం అనే దాని కంటే.. ఎంత బాగా మీ ఆలోచనలు ఎదుటి వ్యక్తికి విశదీకరించ గల్గుతున్నావనేదే ముఖ్యం. దీనికి చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. టీం విజయవంతం కావడంలో కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది.

విద్యార్థి దశలో అంటే ప్రతిదీ దగ్గరుండి నేర్పడానికి టీచర్లు ఉంటారు కానీ.. ఉద్యోగంలో చేరాక అలా కుదరదు. మీ అంతట మీరే ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థి ఏదైనా విషయాన్ని త్వరగా నేర్చుకుంటాడా లేదా అనే విషయాన్ని రిక్రూటర్లు పరిశీలిస్తారు. ఈ ఐదు నైపుణ్యాలన పెంపొందించుకోగలిగితే.. ఉద్యోగ సాధనలో మీరు తోటి వారి కంటే ఓ అడుగు ముందున్నట్లే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.