యాప్నగరం

సౌత్ ఇండియన్ బ్యాంకులో పీ‌ఓలు, క్లర్క్‌లు

సౌత్ ఇండియన్ బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 17 Jan 2017, 4:00 pm
సౌత్ ఇండియన్ బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న సౌత్ ఇండియన్ బ్యాంకు శాఖల్లోని పీఓ, క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu south indian bank probationary officers and clerks notification
సౌత్ ఇండియన్ బ్యాంకులో పీ‌ఓలు, క్లర్క్‌లు

ప్రొబేషనరీ ఆఫీసర్: 201
ప్రొబేషనరీ క్లర్క్: 336
విద్యార్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇంగ్లిష్, సంబంధిత ప్రాంతీయ భాషల్లో పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్య్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: న్యుమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే పరీక్షను నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: సౌత్ ఇండియన్ బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జనవరి 19
చివరితేది: జనవరి 27

నోటిఫికేషన్ అండ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.