యాప్నగరం

SSC MTS Registration: 'మల్టీటాస్కింగ్ స్టాఫ్' పోస్టుల దరఖాస్తుకు నేటితో ఆఖరు

పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

Samayam Telugu 29 May 2019, 12:21 pm

ప్రధానాంశాలు:

  • మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుకు మే 29 చివరి తేదీ కాగా.. మే 31 వరకు ఫీజు చెల్లించవచ్చు.
  • చలానా రూపంలో జూన్ 1 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ssc
స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) మల్టీటాస్కింగ్ పోస్టుల దరఖాస్తు గడువు బుధవారం(మే 29) సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థుల వయపు 01.08.2019 నాటికి 18-25 సంవ‌త్సరాల మధ్య ఉండాలి. కొన్ని పోస్టులకు 18-27 సంవ‌త్సరాల మధ్య ఉండాలి నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
undefined
మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుకు మే 29 చివరి తేదీ కాగా.. మే 31 వరకు ఫీజు చెల్లించవచ్చు. చలానా రూపంలో జూన్ 1 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబరు 6 వరకు మధ్యకాలంలో పేపర్-1 పరీక్ష, నవంబరు 17న పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, పరీక్ష తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 22.04.2019.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 29.05.2019 (సా. 5.00 గం)
ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించడానికి చివరితేది 31.05.2019. (సా. 5.00 గం)
ఆఫ్‌లైన్ చలనా జనరేట్ చేసుకోవడానికి చివరితేది 31.05.2019.(సా. 5.00 గం)
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది01.06.2019.
పేపర్-1 పరీక్ష తేది 02.08.2019 - 06.09.2019
పేపర్-2 పరీక్ష తేది 17.11.2019.

వెబ్‌సైట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.