యాప్నగరం

Telangana Schools Closed: తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్.. ప్రకటించిన ప్రభుత్వం

TS Colleges Closed: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌ను రేపటి (మార్చి 24) నుంచి తాత్కాలికంగా మూసివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు

Samayam Telugu 24 Mar 2021, 11:09 am
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌ను రేపటి (మార్చి 24) నుంచి తాత్కాలికంగా మూసివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ కరోనా పడగ విప్పుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి.
Samayam Telugu స్కూళ్లు బంద్


తెలంగాణ రాష్ట్రంలో కూడా పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 10వ తరగతి లోపు స్కూళ్లు, గురుకులాలను, వసృతి గృహాలను వెంటనే మూసివేస్తే మేలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.

HPCL లో 200 జాబ్స్‌.. బీఈ/బీటెక్‌ వాళ్లు అర్హులు.. రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు జీతం
ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చింది‌ తుది నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అంచనా. పిల్లల్లో రోగనిరోధక శక్తి సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. వీరిలో పాజిటివ్‌ లక్షణాలు బయటకు కనిపించవు. అందు వల్ల విద్యార్థులు తరగతులకు హాజరై ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ప్రజలకు, కుటుంబ సభ్యులకు కరోనా వ్యాపించడానికి కారణమవుతుందని అభిప్రాయపడుతున్నారు. అందువల్లనే ఈ నెలారంభం నుంచి నానాటికి కరోనా కేసులు పెరుగుతున్నాయని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.