యాప్నగరం

January Holidays List : జనవరిలో సంక్రాంతితో పాటు సెలవుల లిస్ట్‌ ఇదే..!

Sankranti Holidays 2023 : ఆదివారాలు, రెండో శనివారం కలిపితే జనవరి నెలలో బోలెడు సెలవులు వస్తాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు కాస్త భిన్నంగా ఉంది. వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 22 Dec 2022, 7:11 pm
Sankranti Holidays 2023 : త్వరలో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులు (Sankranti Holidays). ఇదే నెలలోనే రిపబ్లిక్ డే సైతం ఉంటుంది. దీంతో ఈ నెలలో సెలవులకు కొదువ ఉండదనే చెప్పాలి. ఇంకా ఆదివారాలు, రెండో శనివారం కలిపితే బోలెడు సెలవులు వస్తాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు కాస్త భిన్నంగా ఉంది. జనవరి నెలలో మాత్రం పండుగలు ఎక్కువగానే ఉన్నా..సెలవులు మాత్రం ఆ స్థాయిలో లేవు.
Samayam Telugu Sankranti Holidays 2023


జనవరి నెల ప్రారంభంలోనే January 1st New Year ఉంటుంది. అయితే.. సాధారణ సెలవుల్లో జనవరి 1ని కూడా ప్రభుత్వం పేర్కొంది. కాకపోతే ఈ సారి జనవరి 1 ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు అదనంగా సెలవు తీసుకునే అవకాశం లేదు. అలాగే.. భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ రోజు రెండో శనివారం. దీంతో విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు. ఇక జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. అయితే.. ఈసారి సంక్రాంతి కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడం మరో నిరాశ కలిగించే అంశం.

జనవరి 16న సోమవారం కనుమ పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా రిపబ్లిక్ డే జనవరి 26న గురువారం రోజు వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది. ఇవి కాకుండా.. జనవరి 8, 22, 29 తేదీల్లో ఆదివారం ఉంటుంది. ఇంకా జనవరి 28న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు, కొన్ని ఆఫీసులకు ఆ రోజు సెలవు ఉంటుంది.

TS SSC Exams : ఏప్రిల్‌ మొదటి వారంలో 10వ తరగతి పరీక్షలు..? పూర్తి వివరాలివే

Work From Home : 2023 డిసెంబర్‌ వరకూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం
Government : ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. వర్క్‌ ఫ్రం హోం (Work From Home) వెసులుబాటునుంచి ఆఫీసులకు వెడుతున్న పలు స్పెషల్ ఎకనామిక్ జోన్ల(SEZ)లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల యూనిట్ల (SEZ)లో ఉన్న ఐటీ, ఐటీ ఆదారిత కంపెనీల్లోని 100 శాతం మంది ఉద్యోగులకు ఇంటి నుండి పూర్తి పనిని అనుమతించింది.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.