యాప్నగరం

13 లేదా 15న తెలంగాణ ఇంటర్ ఫలితాలు..?

తెలంగాణలో ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ 13న ఫలితాల విడుదల కుదరని పక్షంలో ఏప్రిల్ 15న ఫలితాలను విడుదలచేసే అవకాశం ఉంది.

Samayam Telugu 10 Apr 2018, 11:49 am
తెలంగాణలో ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ 13న ఫలితాల విడుదల కుదరని పక్షంలో ఏప్రిల్ 15న ఫలితాలను విడుదలచేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 8నాటికే ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తవడంతో... ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు సమాయత్తమైంది. ఎట్టిపరిస్టితుల్లోనూ 13నే ఫలితాలను విడుదల చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. ఎందుకంటే 14న అంబేద్కర్ జయంతి ఉన్నందున... ఆరోజు కుదరదు. ఒకవేళ 13న కుదరకపోతే... గత్యంతరం లేని పక్షంలో ఏప్రిల్ 15న ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
Samayam Telugu Results


ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 19 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు మొత్తం 9.63 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలు ముగిసి నెలకూడా గడువక ముందే... ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేయనుంది.
Website

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.