యాప్నగరం

TS Inter 1st, 2nd Year Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.

Samayam Telugu 13 Apr 2018, 2:45 pm
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 9 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 62.35 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ద్వితీయ సంవత్సరంలో 67.25 ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో 2,84,224 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా.. సెకండియర్‌లో 2,88,772 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
Samayam Telugu Inter_TS


ఫలితాలు నేరుగా మీ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పొందడానికి ఈ కింది బాక్సులో వివరాలను పూర్తి చేయండి.

See Results: ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఇక ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో బాలికలు 69 శాతం సాధిస్తే.. బాలురు 55.66 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 73.25 శాతం మంది బాలికలు, 61 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్, కొమురంభీం జిల్లాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. 40 శాతం ఉత్తీర్ణతతో మహబూబ్‌నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇక ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు.

చదవండి: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ షెడ్యూల్

ఫిబ్రవరి 28 నుంచి మార్చి19 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,63,546 మంది విద్యార్థులు హాజరు కాగా.. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,55,635 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,07,911 మంది ఉన్నారు. ఏప్రిల్ 8 నాటికే మూల్యాంకనాన్ని పూర్తిచేసిన ఇంటర్ బోర్డు.. నేడు ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను tsbie.cgg.gov.in, www.bie.telangana.gov.in, www.exam.bie.telangana.gov.in, results.cgg.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని విద్యా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే TSBIE Services అనే మొబైల్‌ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని మార్కులను తెలుసుకోవచ్చని వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.