యాప్నగరం

TS POLYCET-2018: తెలంగాణ పాలీసెట్ ఫలితాలు విడుదల..!

తెలంగాణ పాలీసెట్ ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 1) సాయంత్రం విడుదలయ్యాయి. నాంపల్లిలోని విద్యాభవన్‌లో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలో మొత్తం 92.21శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Samayam Telugu 1 May 2018, 8:16 pm
తెలంగాణ పాలీసెట్ ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 1) సాయంత్రం విడుదలయ్యాయి. నాంపల్లిలోని విద్యాభవన్‌లో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలో మొత్తం 92.21శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణలోని పాలీటెక్నిక్ కళాశాలల్లో వివిధ కోర్సులకు సంబంధించి ప్రవేశాలకుగాను ఏప్రిల్ 21న పాలీసెట్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 359 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు.
Samayam Telugu Results..


పరీక్షలకు మొత్తం లక్షా 21 వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే వీరిలో లక్షా 12 వేలమంది ఉత్తీర్ణులయ్యారు. అంటే దాదాపు 92 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పాలీసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ నెంబరుతో అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.
TS POLYCET 2018 Results

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.