యాప్నగరం

Telangana Holidays 2022: విద్యార్థులకు అలర్ట్‌.. వచ్చే ఏడాది సెలవులు, పండుగలు ఇవే.. ఆ నెలలోనే ఎక్కువ సెలవులు

Telangana Public Holidays 2022: వచ్చే ఏడాదికి గానూ పండుగలు, సెలవుల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది.

Samayam Telugu 27 Nov 2021, 6:03 pm
Government Holidays 2022: రాబోయే ఏడాది (2022)కి గానూ పండుగలు, సెలవుల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. వచ్చే ఏడాది 28 సాధారణ సెలవులు, 23 ఆప్షన్‌ సెలవులను గుర్తించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
Samayam Telugu తెలంగాణ సెలవులు 2022


నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ప్రకారం 23 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించారు. ముఖ్యమైన సెలవులు జనవరి 1 నూతన సంవత్సరం, 15 సంక్రాంతి, 26 గణతంత్రదినోత్సవం, మార్చి 1 మహాశివరాత్రి, 18 హోళీ, ఏప్రిల్‌ 2 ఉగాది, 10 శ్రీరామనవమి, 14 అంబేడ్కర్‌ జయంతి, 15 గుడ్‌ఫ్రైడే, మే 3, 4 రంజాన్‌, ఆగస్టు 15 స్వాతంత్య్రదినోత్సవం, సెప్టెంబరు 25 బతుకమ్మ ప్రారంభరోజు, అక్టోబరు 5 విజయదశమి, 9 మిలాద్‌-ఉన్‌-నబి, 25 దీపావళి, డిసెంబరు 25 క్రిస్‌మస్‌గా పేర్కొన్నారు. కాగా.. వారాంతపు సెలవు దినం అయిన ఆదివారం నాడు ఆరు సెలవు దినాలు రావడం గమనార్హం.

TS EAMCET BiPC counselling: తెలంగాణ ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్య తేదీలివే
ఏప్రిల్‌ నెలలోనే ఆరు సాధారణ సెలవులు రానున్నాయి. ఉగాది, శ్రీరామనవమితో పాటు మరో నాలుగు సెలవులు ఈ నెలలో రానున్నాయి. అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే జనవరి 1న సెలవు దినంగా ప్రకటించినందున.. ఆరోజుకు బదులుగా ఫిబ్రవరి 12 రెండో శనివారం రోజున కార్యాలయాలు పని చేస్తాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులు ఐదుకు మించి ఆప్షనల్‌ హాలిడేస్‌ వాడుకోరాదని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.