యాప్నగరం

Telangana SI Results: ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల

పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,88,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,88,482 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొత్తం 1,10, 635 మంది తదుపరి దశకు అర్హత సాధించారు.

Samayam Telugu 17 Sep 2018, 8:47 am
తెలంగాణలో ఎస్‌సీటీ సబ్ ఇన్స్‌పెక్టర్ (సివిల్), తత్సమాన పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో మొత్తం 1,10, 635 మంది తదుపరి దశకు అర్హత సాధించారు. వీరిలో అత్యధికంగా ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థులే ఉండటం విశేషం. ఆగస్టు 26న తెలంగాణ వ్యాప్తంగా ప్రిలిమ్స్ రాతపరీక్ష నిర్వహిాంచారు.
Samayam Telugu police

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,88,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,88,482 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన 'కీ' ని ఆగస్టు 27న విడుదల చేశారు. ఆగస్టు 29 వరకు దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు ఫలితాలను విడుదలచేశారు.

ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సంబంధించి మూడు దశల నియామక ప్రక్రియలో భాగంగా ఈ ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి రెండో దశలో ఈవెంట్స్ ఉంటాయి. అందులోనూ క్వాలిఫై అయిన వారికి తుది దశలో మెయిన్స్ రాతపరీక్ష నిర్వహిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.