యాప్నగరం

Ed.CET Hall Tickets: టీఎస్ ఎడ్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్..

ఈ ఏడాది ఎడ్‌సెట్ పరీక్షకు 52,380 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 39,922 మంది అమ్మాయిలు ఉండగా.. 12,458 మంది అబ్బాయిలు ఉన్నారు.....

Samayam Telugu 23 May 2019, 1:32 pm

ప్రధానాంశాలు:

  • వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో
  • మే 23 నుంచి 31 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో
  • మే 31న రెండు సెషన్లలో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu TSEdcet
తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి మే 31న నిర్వహించనున్న ఎడ్‌సెట్-2019 పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను సమర్పించి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మే 23 నుంచి 31 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఎడ్‌సెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
షెడ్యూలు ప్రకారం మే 31న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లిష్, సోషల్, ఫిజిక్స్ విభాగాలకు చెందిన వారికి; మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మ్యాథ్స్, బయాలజీ విభాగాలకు చెందినవారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఈ ఏడాది ఎడ్‌సెట్ పరీక్షకు 52,380 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 39,922 మంది అమ్మాయిలు ఉండగా.. 12,458 మంది అబ్బాయిలు ఉన్నారు. పరీక్ష నిర్వహణ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 83 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో తెలంగాణలో 80, ఏపీలో 3 కేంద్రాలు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.