యాప్నగరం

TSPSC Group 4: గ్రూప్-4 ఫైనల్ 'కీ' విడుదల

ప్రాథమిక 'కీ'పై కొందరు అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం కమిషన్ తుది 'కీ' వెల్లడించింది.

Samayam Telugu 4 Dec 2018, 12:47 pm
గ్రూప్‌-4, ఇతర పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన ఫైనల్ ‘కీ’లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. పేపర్-1 (జనరల్ నాలెడ్జ్), పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) రాత పరీక్షల తుది ‘కీ’ని వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక 'కీ'పై కొందరు అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం కమిషన్ తుది 'కీ' వెల్లడించింది. ఇకపై తుది 'కీ' పై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.
Samayam Telugu TSPSC


మొత్తం 1,595 గ్రూప్-4 పోస్టులతోపాటు ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో 124 బిల్‌ కలెక్టర్‌ పోస్టులు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 76 పోస్టుల భర్తీకి అక్టోబరు 7న రాతపరీక్ష నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 4.49 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ ని అక్టోబరు 22న విడుదల చేశారు. అనంతరం అక్టోబర్ 23 నుంచి 29 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం సవరించిన తుది కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

పేపర్ -1 (జనరల్ నాలెడ్జ్) ఫైనల్ కీ..

పేపర్ - 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) ఫైనల్ కీ..

వెబ్‌సైట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.