యాప్నగరం

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండో సంవత్సరం జనరల్, వొకేషనల్‌కోర్సుల ఫలితాలు వెలువడ్డాయి.

TNN 16 Apr 2017, 11:12 am
తెలంగాణ ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండో సంవత్సరం జనరల్, వొకేషనల్‌కోర్సుల ఫలితాలు వెలువడ్డాయి. ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌మొదటి సంవత్సరం ఫలితాల్లో 57 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల ఫలితాలు మెరుగయ్యాయని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఫస్టియర్‌ పరీక్షకు 4,75,874 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,70,738 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫస్టియర్ ఉత్తీర్ణులైన వారిలో 50 శాతం మంది విద్యార్థులు 'ఏ' గ్రేడ్‌సాధించారన్నారు.
Samayam Telugu telgangana intermediate first year general and vocational results
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు


ఇక జిల్లాల వారిగా పరిశీలిస్తే.. ఇంటర్‌ఫస్టియర్‌లో టాప్‌లో మేడ్చల్‌ జిల్లా నిలవగా.. రెండో స్థానంలో రంగారెడ్డి నిలిచింది. చివరిస్థానంలో మహబూబాబాద్‌ నిలిచింది. మే 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కడియం శ్రీహరి వెల్లడించారు.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
జనరల్
వొకేషనల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.