యాప్నగరం

గ్రూప్‌-2 భర్తీ ప్రక్రియపై హైకోర్టు స్టే

ఇవాళ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియకు సిద్ధమైన టీఎస్‌పీఎస్సీ.. న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు ఫలితాలను ప్రకటించకుండా వేచి చూడాల్సిందే.

TNN 12 Jun 2017, 4:53 pm
తెలంగాణలో గ్రూప్‌-2 నియామక ప్రక్రియపై హైకోర్టు సోమవారం (జూన్ 12) స్టే ఇచ్చింది. మూడు వారాల వరకు నియామక ప్రక్రియ చేపట్టవద్దని టీఎస్‌పీఎస్‌సీకి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైటనర్‌తో దిద్దిన ఆన్సర్ షీట్లను పరిగణనలోకి తీసుకున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. గ్రూప్‌-2 నియామక ప్రక్రియపై కొంత కాలంగా వివాదం చెలరేగుతోంది. జవాబు పత్రంపై వైటనర్‌తో దిద్దినా.. కొన్ని ఓఎమ్‌ఆర్ షీట్లను మూల్యాంకనంలోకి తీసుకున్నారంటూ కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. టీఎస్‌పీఎస్సీ 1032 పోస్టులతో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ జారీ చేసింది. గత నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్‌-2 రాత పరీక్షకు 5.65 లక్షల మంది హాజరయ్యారు. ఇటీవల ఫలితాలు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ 3 వేల మందికిపైగా అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది.
Samayam Telugu the hyderabad high court stay on tspsc group 2 recruitment process
గ్రూప్‌-2 భర్తీ ప్రక్రియపై హైకోర్టు స్టే


అయితే, గ్రూప్‌-2 పరీక్షల్లో పలు అక్రమాలు జరిగాయని, డబుల్‌ బబ్లింగ్‌ చేసిన అభ్యర్థులను, వైటనర్‌ ఉపయోగించిన వారి ఆన్సర్ షీట్లను కూడా మూల్యాంకనంలోకి తీసుకున్నారంటూ.. కొంత మంది ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలన నిలిపేయాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి భర్తీ ప్రక్రియ చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇవాళ్టి నుంచి చేపట్టిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.